Andhra Pradesh
ఐరాల మండల ప్రజలకు జడ్పిటిసి అభ్యర్థి సుచిత్ర సూచన !
Published
9 months agoon
కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు పోలీసుశాఖ, ఆరోగ్యం శాఖ, రెవెన్యూ శాఖ చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలని ఐరాల మండల జడ్పిటిసి అభ్యర్థి సుచిత్ర కన్నయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు మంగళవారం సుచిత్ర మీడియాతో మాట్లాడుతూ ఐరాల మండలం సంబంధించిన పరిసర ప్రాంతాలలోని ప్రజలు కరోన బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. దీని కారణంగా ఆందోళనకు గురి కావాల్సి అవసరము లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది అధైర్యపడకుండా కరోనా కట్టడికి నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మన డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నప్పుడు మన రూపాయి కాగితాలను కాయిన్స్ ను శానిటైజ్ చేయడం లేదు. Corona ను కట్టడి చేయలేకపోవడానికి 70 శాతం మన కరెన్సీని శానీటిస్ చేయకపోవడం ఇది ఒక కారణం. ఇంటి నుంచి బయట వచ్చినప్పుడు, ఇంటి లోపల ఉన్నపుడు మాస్కులు ధరించి కపోవడం, క్రమం తప్పకుండా చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేయకపోవడం, ఒక వ్యక్తికి వ్యక్తికి సమదూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే మనం కరోనాని నివారించలేము. కావున ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయడానికి సాధ్యమవుతుందని, తగు జాగ్రత్తలు తీసుకొని అధికారులకు ప్రజలు పూర్తి సహకారాన్ని అందిస్తే కరోనా ను కట్టడి చేయవచ్చని ఆమె తెలిపారు.
YSRCP Leader Suchitra Kannaiah Naidu Suggest To Public