Connect with us

IPL 2020

ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల అనుమ‌తి ?

Published

on

ఐపీఎల్… కాసుల వర్షం కురిపించే లీగ్… డబ్బుకు డబ్బు… పబ్లిసిటీకీ పబ్లిసిటీ ..ఇయితే మొన్నటి వరకూ జరిగిన కథ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఏడాది సమ్మర్ లో జరగాల్సిన లీగ్ కరోనా దెబ్బకు వాయిదా పడడంతో ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకున్న కొన్ని కంపెనీలు వాటిని రద్దు చేసుకుంటున్నాయి. దీంతో ఈ సారి కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ ఆదాయానికి గట్టిగానే తగలబోతోంది. అసలు స్పాన్సర్ల వెనకడుగు వేయడానికి కారణమేంటి…

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఐపీఎల్…ఆటగాళ్ల నుంచి బీసీసీఐ వరకూ… ఫ్రాంచైజీల నుంచి స్పాన్సర్ల వరకూ కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఐపీఎల్ ఒక పేరు కాదు… అదొక బ్రాండ్… ఈ లీగ్ లో పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కట్టేవి. పబ్లిసిటీకి పబ్లిసిటీ… డబ్బుకు డబ్బు… ఇదీ మొన్నటి వరకూ జరిగిన కథ. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు సీన్ రివర్సైంది. రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మార్చిలో జరగాల్సి ఉండగా.. కరోనా దెబ్బకు వాయిదా పడింది. ఇప్పుడు దుబాయ్ వేదికగా సెప్టెంబర్ లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకున్న పలు కంపెనీలు వాటిని రద్దు చేసుకుంటున్నాయి. 8 ఫ్రాంచైజీలలో కనీసం ఐదు స్పాన్సర్లు లేక ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీ ఫ్రాంచైజీ కనీసం ఒక్కో స్పాన్సర్ ను కోల్పోయినట్టు సమాచారం. దీనికి కారణాలు లేకపోలేదు… ప్రధానంగా కరోనా లాక్ డౌన్ తో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆదాయం లేక ఇబ్బందిపడుతున్నాయి. ఐపీఎల్ తో తన బ్రాండ్ కు మంచి పబ్లిసిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్న వారి అంచనాలు కరోనా దెబ్బకు గల్లంతయ్యాయి. ఉదాహరణకు ఒక ప్రముఖ ఏసీ బ్రాండ్ ప్రముఖ ఫ్రాంచైజీతో ఫిబ్రవరిలోనే ఒప్పందం చేసుకుంది. ఈ సమ్మర్ లో ఐపీఎల్ ద్వారా తమ మార్కెటింగ్ బాగా పెరుగుతుందని అంచనా వేసింది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ సమ్మర్ లో జరగలేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో లీగ్ జరిగినా.. తమ బ్రాండ్ కు ఏం ఉపయోగముండదని భావిస్తూ ఒప్పందం రద్దు చేసుకుంది.

మరికొన్ని ఫ్రాంచైజీల స్పాన్సర్ల స్టోరీలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఇప్పుడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం అనుమానమే. ఒకవేళ అనుమతించినా అది పరిమిత సంఖ్యలోనే ఉంటుంది. దీంతో టీవీ వ్యూయర్ షిప్ కే ఈ ఐపీఎల్ పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో గత సీజన్ల తరహాలో స్పాన్సర్లకు బ్రాండింగ్ వచ్చే అవకాశం లేదు. దీనికి తోడు లాక్ డౌన్ తో పెద్ద పెద్ద కంపెనీలకే ఆదాయం పడిపోయింది. ఇటువంటి సమయంలో ఎంత పెద్ద లీగ్ తోనైనా ఒప్పందం చేసుకున్నావచ్చే పబ్లిసిటీ పెద్దగా ఉండదు. గత సీజన్ల సమయంలో చేసుకున్నఒప్పందం విలువలో సగానికి తగ్గించినా కూడా స్పాన్సర్లు ముందుకు రావడం లేదనే ఓ ఫ్రాంచైజీ ప్రతినిధి చెబుతున్నారు. దీనిని బట్టే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు దుబాయ్ లో లీగ్ జరగనుండడంతో ఖర్చు కూడా ఎక్కవవనుంది. అటు బ్రాడ్ కాస్టర్ల ఆదాయం పైన కూడా ప్రభావం ఉండబోతోంది. అడ్వైర్టైజింగ్ స్లాట్లను అమ్మేటప్పుడు గత సీజన్ల ధర రాకపోవచ్చు. ఈ మొత్తం పరిస్థితికి కరోనానే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అసలు లీగ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలకు తెరపడడం ఫ్రాంచైజీలకు కొంతలో కొంత ఊరటనిస్తోంది. ఏదేమైనా ఈ ఐపీఎల్ ఇటు ఫ్రాంచైజీలకు అసలైన కష్టకాలం చూపిస్తోంది.

                                                                                                                                                                                                     సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్  : MN  రావు