Connect with us

Bhadradri Kothagudem

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపై వ‌న‌మా దిగ్భ్రాంతి

Published

on

దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందటం పట్ల కొత్తగూడెం శాససభ్యులు వనమా వెంకటేశ్వర రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకం అయి ఉండే గుణం వల్లనే ఆయన 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగుసార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలిచారని వనమా అన్నారు. 2001 నుంచి తెరాసా అధినేత శ్రీ కేసీఆర్ గారి తో కలసి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర నిర్వహించారని గుర్తుచేశారు. అనేక ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీ లో అనునిత్యం ప్రజా సమస్యల పై మాట్లాడేవారని వనమా అన్నారు. అటువంటి ఒక ప్రజా నాయకుడిని కోల్పోవటం చాలా దురదృష్టం అని వనమా వ్యాఖ్యానించారు.

Vanama Condoles Death Of MLA Ramalinga Reddy