Entertainment
వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రివ్యూ…
Published
5 months agoon
Vakeel Saab Motion Poster
ఈరోజు నటుడు, రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి చిత్రబృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. సరిగ్గా ఈ రోజు ఉదయం 9.09 గంటలకు దీన్ని విడుదల చేశారు. మరి విడుదలైన వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ఎలా ఉంది…ఫ్యాన్స్ రియాక్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాం..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్ వచ్చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కీలకపాత్ర పోషిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో అంబేద్కర్ మరియు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫొటోలో మధ్యలో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో చైర్ మీద ఒక కాలు పెట్టి ఒక చేతిలో క్రిమినల్ లా పట్టుకొని, మరొక చేతిలో క్రిమినల్స్ ను తరిమి కొట్టేందుకు బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపంచాడు పవన్. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో సత్యమేవ జయతే అంటూ వచ్చే ఆర్ ఆర్ మోషన్ పోస్టర్‌కి మరింత హైప్ ఇచ్చింది. ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్నది.
ఇన్నేళ్లు ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్ కు ఏది కావాలో అదే చూపించారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది.. అనడానికి ఈ మోషన్ పోస్టరే ఉదాహరణ. లాయర్ కోట్ వేసుకొని పవన్ కల్యాణ్ కుర్చీ మీద కాలు పెట్టి లా పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని నిలబడిన తీరు చూసి పవన్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌లు న్యాయవాదులుగా కనిపించనుండగా నివేదా థామస్, అంజలి, అనన్యలు కీలక రోల్ ప్లే చేయనున్నారు.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వకీల్ సాబ్‌ను దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.