Connect with us

Sangareddy

ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రత..ప‌ట్టించుకోని అధికారులు

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది .ముందే వర్షాకాలం కావడంతో ఆయురారోగ్యాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రోగులు వస్తుంటారు కానీ వారికి వచ్చిన రోగం తక్కువ ఈ అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలు ఎక్కువ అని.ఆయా గ్రామాల ప్రజలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు .రాత్రి సమయాల్లో విష సర్పాలు బయటకు వస్తున్నాయని ఆసుపత్రి చుట్టుపక్కల నివసించే పలు కుటుంబాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వారంటున్నారు .ఇప్పటికే తాము అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నామని ఈ అపరిశుభ్రత వల్ల మరింత రోగాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రికి వెళ్లే దారిలో ఆసుపత్రిలోపెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని వారు కోరుతున్నారు. పేరుకే మండల కేంద్రమైనప్పటికీ అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Unhygienic in health centre at pulkal