Three Pawan Kalyan Fans Die Of Electrocuted

చిత్తూరు:- సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడకల్లో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 25 అడుగుల ఎత్తున బ్యానర్ కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. ముగ్గురు కూడా అక్కడిక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.


