Connect with us

Sangareddy

పుల్కల్‌లో నాణ్యతలేని మురుగు కాలువ నిర్మాణ పనులు

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణం పనులు నాణ్యత లేని మెటీరియల్తో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది అయినా కూడా ఇక్కడి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాణ్యత లేని కంకర, డేస్ట్ సిమెంటు, నాణ్యత లేని వస్తువులతో నిర్మాణం చేపడుతున్నారు. విష‌యం తెలుసుకున్న‌ గ్రామస్తులు అధికారుల‌కు ఎన్నిసార్లు విన్నవించినా ప‌ట్టించుకోని ప‌రిస్థితి. స‌ద‌రు నిర్మాణ కాంట్రాక్ట‌ర్ మాకు నచ్చిందే చేస్తాం, మీరు ఎవరికైనా , ఏ అధికారికి అయినా చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్న‌ట్లు గ్రామ‌స్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామంలో నిర్మాణం జరుగుతున్నటువంటి మురికి కాలువ పనులు మురికి కాల్వలను నాణ్యతతో కూడిన సామాగ్రిని వాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని ఎడల ఈ నిర్మిస్తున్న మురికి కాలువ ఎప్పుడు పోతుందో ఎంత మందికి ప్రాణాపాయం జరుగుతుందో అర్థం కావడం లేదని గ్రామస్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిర్మించే మురికి కాలువ పనులను నాణ్యత గల మెటీరియల్ ను వాడి కాలువ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు లేని ఎడల గ్రామస్తులంతా ఏకమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఫైర్ అయ్యారు.

Substandard Material In Sewer At Pulkal

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *