Connect with us

Sports

సన్‌రైజర్స్‌ పటిష్టమైన బ్యాటింగ్‌ బలం…

Published

on

అత్యుత్తమ బౌలింగ్‌ శ్రేణితో… సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఐపీఎల్‌ సీజన్‌ 2020కి సన్నద్ధమవుతోంది. బాధ్యతాయుత ఆటతీరుతో జట్టువిజయాల్లో కీలకపాత్రపోషించే కేన్‌ విలియంసన్‌, డాషింగ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ , మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగే మనీష్‌ పాండే, బంతుల్ని బౌండరీలైన్లకు తరలించే జానీ బెయిర్‌ స్ట్రో వంటి చురుకైన ఆటగాళ్లు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. పేస్‌ బౌలింగ్‌ స్పెషలిస్టు భువనేశ్వర్‌ కుమార్‌ తన మాయాజాల బంతులతో ఓటమి అంచుకు చేరిన మ్యాచులను మలుపు తిప్పిన సందర్భాలున్నాయి. స్పిన్నర్లు రషీద్‌ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఫాబియన్‌ అల్లెన్‌, ఆల్‌ రౌండర్లు మహ్మద్‌ నబీ, అభిషేక్‌ శర్మ, మిచెల్‌ మార్ష్‌, సందీప్‌ భవనక, అబ్ధుల్‌ సమద్‌ వంటి ఆటగాళ్ల తమవంతు బాధ్యతగా సత్తాచాటాలని ఎదురు చూస్తున్నారు. వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స గోస్వామి, విరాట్‌ సింగ్‌, ప్రియంగార్గ్‌, సంజయ్‌ యాదవ్‌, విజయ్‌ శంకర్‌ తదితర ఆటగాళ్లు అవకాశం దొరికినపుడు తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

ఐపీఎల్‌ సీజన్‌ 2008లో ప్రారంభమైనప్పటికీ… 2013 సీజనల్‌లో పుట్టుకొచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యుత్తుమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ట్రోఫీలక్ష్యంగా బరిలోకి దిగిన జట్లను వణికించింది. 2016లో జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. 2018 సీజన్లో వీరోచితంగా పోరాడిన హైదరాబాద్‌… ఫైనల్లో చెన్నై జట్టుకు దడపుట్టించింది. పరాజయం పాలైనప్పటికీ… కెప్టన్‌ విలియంసన్‌ బాధ్యతాయుత ఆటతీరుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

బ్యాటింగ్‌ బలంతో ప్రత్యర్థిజట్టును ఉక్కిరి బిక్కిరి చేయడంలో… బౌలింగ్‌ దళంతో.. అదే జట్టును ఆటకట్టించడంతో ప్రతిమ్యాచ్‌లోనూ విజయవకాశాలు అందుకోవచ్చనే భావన సన్‌ రైజర్స్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌, మాజీ సారథి కేన్‌ విలియంసన్‌ లలో వ్యక్తమవుతోంది. అనుభజ్ఞులున్న సన్‌ రైజర్స్‌ జట్టు ఆటతీరులో దూకుడు తనాన్ని ప్రదర్శించకుండా బ్యాటింగ్‌ తోనూ….. బౌలింగ్‌ తోనూ… ప్రత్యర్థి జట్లను ఆటకట్టించేందుకు వార్నర్‌ సేన సమాయాత్తమవుతోంది.

SRH IPL 2020 Latest News