Connect with us

Entertainment

వ‌కీల్ సాబ్‌లో శృతి ఫిక్స్..?

Published

on

అజ్ణాత‌వాసి సినిమా త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. ఫుల్‌ఫ్లెడ్జ్ రాజ‌కీయాల్లో క్రీయాశీల‌కంగా మారిన ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాల బాట ప‌ట్టారు. ఓ వైపు త‌న‌దైన రాజ‌కీయాల‌ను అనుస‌రిస్తూనే మ‌రోవైపు మొహానికి రంగు వేసుకుని సినిమాల్లో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌నున్నారు. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. దిల్ రాజు మ‌రియు బోనీ క‌పూర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌గ‌భాగం కంప్లీట్ అయిన‌ప్ప‌టికీ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ లేదు. వార్త‌ల్లో మాత్రం ప‌లానా హీరోయిన్ అంటూ వినిపిస్తున్నాయి. గోవా బ్యూటీ ఇలియానా పేరు ఇదివ‌ర‌కే బాగా వినిపించింది. అయితే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే తాజాగా ఓ వార్త మ‌రోసారి చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్‌లో శృతి హాస‌న్ ఫిక్స్ అయిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఇప్ప‌టికైనా వ‌కీల్ భామ ఎవ‌ర‌న్న‌ది చిత్ర యూనిట్ రివిల్ చేస్తుందో లేదో వేచి చూడాలి ఇక‌పోతే శృతి ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో న‌టించింది. టాలీవుడ్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌, అలాగే కాట‌మ‌రాయుడు చిత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. అయితే గబ్బ‌ర్ సింగ్ మాత్రం ప‌వ‌న్ కెరీర్‌లో, శృతిహాస‌న్ కెరీర్లో భారీ చిత్రంగా నిలిచింది. అయితే మ‌ళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుంద‌న్న వార్త‌ల్లో నిజ‌మెంత అన్న‌ది ప‌క్క‌నపెడితే ప‌వ‌న్ శృతిహాస‌న్ కాంబోపై మాత్రం క్యూరియాసిటీని పెంచేస్తుంది.

Shruti Haasan confirms her presence in Vakeel Saab