Connect with us

National

అమిత్‌షా ఎయిమ్స్‌కు వెళ్లాల్సింది: ఎంపీ శ‌శి థ‌రూర్

Published

on

క‌రోనా వ‌స్తే ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళుతున్నారు. కానీ అదే ప్ర‌జ‌ల‌ను పాలించే రాజ‌కీయ నేత‌లు మాత్రం ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తూ ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల గ‌డ‌ప తొక్కుతున్నారు. ప్ర‌స్తుతం ఇదే రిపీట్ అవుతుంది. నిన్నటికి నిన్న తెలంగాణ హోం మంత్రి కానివ్వండి, ప‌లువురు ఎమ్మెల్యేలు కానివ్వండి. ఇక తాజాగా కేంద్రం హోం మంత్రి కూడా ఇదే బాట‌లో వెళ్లారు. ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లిచ్చే కేంద్ర హోం మంత్రి అమిత్ షా క‌రోనా చికిత్స నిమిత్తం ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ ప్ర‌జ‌ల‌కు మాత్రం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు అమోగం అంటూ ప్ర‌క‌ట‌న‌లిచ్చేస్తున్నారు. ఇదే విష‌యంపై కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ మండిప‌డ్డారు. అమిత్ షాకు క‌రోనా వ‌స్తే చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్ల‌కుండా ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి వెళ్ల‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల‌గాలంటే నాయ‌కులు కూడా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకోవాల‌ని అన్నారు. నేత‌లు ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Shashi Tharoor Questions To Amit Shah Over Covid treatment