Connect with us

Sangareddy

స్వచ్చందంగా 15 రోజుల పాటు లాక్ డౌన్…

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ గ్రామంలో స్వచ్చందంగా 15 రోజుల పాటు లాక్ డౌన్ నిర్వహిస్తాము అని గ్రామ సర్పంచ్ అన్నారు. కరోనా వైరస్ విజృంభన వ్యాప్తి తో భయం ప్రజలు భయపడుతున్న తరుణంలో ఏ వ్యక్తిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది ఈ కరోన ప్రతి ఒక్కరినీ పట్టి పిడిస్తుంది ఈ కరోనా మహమ్మారి ఎటు చూసినా, ఎవ్వరిని చూసిన, ఏ పని చెయ్యాలన్న, భయం…భయం ఎప్పుడు ఎలా అంటుకుంటుందో తెలియని గజిబిజి పరిస్థితి నెలకొంది. సింగూర్ ప్రాజెక్టు కు వందల కొద్దీ పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు ఈ ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు హైద్రాబాద్ నగరం నుండి పల్లెలకు మకాం మార్చిన వారు నిత్యం సింగూర్ ప్రాజెక్టును సంచరిస్తుండడంతో స్థానిక గ్రామ వాసులు భయానికి లోనవుతున్నారు. ఎలాగైనా గ్రామంలో. సింగూర్ ప్రాజెక్టు పరిధిలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సర్పంచ్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని,ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రాణాలు ముఖ్యంగా అని భావించి స్వచ్చందంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.అన్ని వ్యాపార వర్గాలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ ఒక్కరు అతిక్రమించి ఉల్లంగించొద్దని సర్పంచ్ యజమానులను కోరారు.ఎవరైనా గ్రామ పంచాయితీ తీర్పు ను కాదని షాప్ లు తెరిస్తే వారికి పంచాయి తరుపున ఫైన్ విడిస్తాము అని అన్నారు. ఈ ఆదివారం నుండి 15 రోజుల పాటు అన్ని షాపులు. మూసి ఉంటాయని తెలిపారు.విచ్చల విడిగా యువత రోడ్ల పైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ కు వచ్చి సంచరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.అత్యవసర పని పై బయటకు వస్తే మాస్క్ ధరించి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజగౌడ్ .ఎంపీటీసీ మంజుల-వీరారెడ్డి. వార్డు మెంబర్స్.గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

self lockdown in singoor village