Connect with us

Bhadradri Kothagudem

కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో సంపూర్ణ లాక్…

Published

on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుంది. వ్యాపార సముదాయాలు, హోటల్ లు, ఆటోలు , ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండే మండల కేంద్రం నిర్మానుష్యం గా ఉన్నది. ములకలపల్లి లోని రాజకీయ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, వర్తక సంగం అద్వర్యం లో సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలానికి నలుదిక్కుల ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగే విదంగా తీర్మానం చేసుకున్నారు.సాయంత్రం6 నుండి8 గంటల వరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు తేరుచుకోవచ్చని తీర్మానం చేసినారు. మైక్ ప్రచారం, సామాజిక మాద్యమాలలో నిన్నటినుంచే విపరీత ప్రచారం చేయడం ద్వారా ప్రజలందరూ స్పందించి లక్డౌన్ కి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదే పరిస్థితి మండలం అంతా అమలు చేసే విదంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆలోచిస్తున్నాయి. ఇదే జరిగితే కరోనా రహిత మండలంగా ములకలపల్లి ఉంటుందని కొందరి విశ్లేషణ.

Self Lockdown In Mulakalapalli Mandal

Continue Reading
1 Comment

1 Comment

  1. Pingback: Ashwapuram Mandal Jaggaram Becomes Contonment Zone || NH9 News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *