Connect with us

Jayashankar Bhupalapally

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సత్యవతి రాథోడ్

Published

on

Satyavathi Rathod On Heavy Rains: వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీలు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు చెప్పారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గర్లో గల గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రిస్క్యూ చేసే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

NH9NEWS