Connect with us

Sangareddy

పంటను నాశనం చేశాడని ఓ రైతు ఆవేదన..

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో అక్రమంగా తన భూమిలోకి వచ్చి ఇప్పుడు ఉన్న పంటను నాశనం చేశాడని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వివ‌రాల‌లోకి వెళితే పెద్దారెడ్డిపేట్ గ్రామంలోని వడ్ల విట్ఠల్ తండ్రి నారాయణ తన భూమి సర్వే నంబర్ 167/ఎక‌ర‌న్న‌ర భూమి 1989 లో వడ్ల సత్యనారాయణ దగ్గర వడ్ల విట్ఠల్ భూమిని కొనుగోలు చేశాడు. అయితే త‌న పట్టా భూమిలో అప్పటినుండి ఇప్పటివరకు భూమి సాగు చేసుకుంటూ విట్ఠల్ జీవనం కొనసాగిస్తున్నాడు.ఇప్పుడు ఆ భూమిలో నాకు వాటా ఉందని వడ్ల అరవింద్ తండ్రి సత్యనారాయణ అక్రమంగా వచ్చి ఇప్పుడు పండుతున్న పంటను అక్రమంగా ట్రాక్టర్ సహాయంతో పంటను నాశనం చేశాడని వడ్ల విట్ఠల్ వాపోయాడు .నాకు న్యాయం కావాలంటూ గ్రామ పెద్దలను కోరాడు.

Sangareddy Farmer Needs Justice