Connect with us

Entertainment

సుశాంత్ ఆరోగ్యంపై రియా షాకింగ్ నిజాలు

Published

on

Rhea Chakraborty About Sushanth Health Problems

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌‌పుత్ గురించి నటి రియాచక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించింది. సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తనకు గతేడాది తెలిసిందని చెప్పుకొచ్చింది. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది.

2019లో మేము యూర‌ప్ వెళ్లాము. అప్పుడే తెలిసింది సుశాంత్ ఆరోగ్య ప‌రిస్థితి బాలేద‌ని. ఒక్కో సారి సుశాంత్ ఒక్కో విధంగా ప్ర‌వ‌ర్తించేవారు. చీక‌టి గ‌దులు అంటే ఎక్కువ‌గా బ‌య‌ప‌డేవాడు. ఆ స‌మ‌యంలో సుశాంత్ సింగ్ ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా మోడాఫినిల్ అనే మెడిసిన్ తీసుకొన్నారు. పారిస్ వెళ్లిన తర్వాత మూడు రోజుల వరకు రూమ్ నుంచి బయటకు రాలేదు. అయితే పారిస్‌కు వెళ్ల‌క‌ముందు సుశాంత్ చాలా సంతోషంగా ఆనందంగా క‌నిపించేవాడు. కానీ యూర‌ప్ ట్రిప్‌లోనే సుశాంత్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా క‌నిపించింది. అయితే ఓ సంద‌ర్భంలో సుశాంత్‌ని ఇలా అడిగాను. ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నావ‌ని. అప్పుడు సుశాంత్ చెప్పిన మాట‌ల‌కు నేను చాలా షాక‌య్యాను అనిఇ తెలిపింది రియా చ‌క్ర‌వ‌ర్తి. 2013 నుంచి డిప్రెషన్ గురవుతున్నట్టు చెప్పారు. హరేష్ శెట్టి అనే సైక్రియాటిస్ట్ వద్దకు వెళ్లినట్టు చెప్పారు. అతడే మోడాఫినిల్ మెడిసిన్ తీసుకోమని చెప్పినట్టు తెలిపారు. యూరప్ పర్యటనలో ఆరోగ్యం క్షీణించడంతో మధ్యలోనే ముంబైకి తిరిగి వచ్చాం అని రియా చక్రవర్తి పేర్కొన్నారు.