Connect with us

Entertainment

ఒకే ఫ్రేమ్‌లో ప్ర‌భాస్ – హృతిక్

Published

on

Prabhas and Hrithik Roshan to collaborate for Dhoom 4

ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్, హృతిక్ రోష‌న్ స్టామినా వేరు. ఇద్ద‌రూ డిఫ్రెంట్ సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. బాలీవుడ్ లో రాకేష్ రోష‌న్ త‌న‌యుడిగా ప‌రిచ‌య‌మై త‌న‌కంటూ సెప‌రేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా ఎదిగాడు. అయితే ఈ బిగ్గెస్ట్ హీరోస్ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌బోతున్నారు. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది నిజం. వార్ సినిమాను నిర్మించిన యష్ రాజ్ సంస్థ.. త్వరలోనే ధూమ్ 4 సిరీస్‌ను పట్టాలెక్కించే‌ ప్లాన్‌లో ఉన్నారట. యష్ రాజ్ ఫిలిమ్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే ధూమ్‌4 లో హృతిక్‌తో పాటు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ను నటింపజేయాలని నిర్మాత అనుకుంటున్నాడట. ఇందుకోసం సంప్రదింపులు జరపాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఓ వైపు బాలీవుడ్ స్టైలిష్ హీరో, మ‌రోవైపు టాలీవుడ్ బాహుబ‌లి ప్ర‌భాస్ లు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తే విజువ‌ల్స్ ఏ రేంజులో ఉంటాయో ఊహించుకోవ‌చ్చు.