Connect with us

Entertainment

పవర్‌ స్టార్‌ గడ్డితింటావా.. రివ్యూ

Published

on

సంచలన సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) విలక్షణశైలితో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ను రిలీజ్‌చేసి సంచలనానికి తెరలేపారు. తెలుగురాష్ట్రాల్లో ఎక్కడచూసినా పవన్‌ కళ్యాణ్‌పై సినిమా ఏకోణంలో తీస్తారోనని ఆతృతతోఉన్నారు. తాజాగా పవర్‌ స్టార్‌ సినిమానుంచి ఓ వీడియో సాంగ్‌ను విడుదలచేశారు. గడ్డితింటావా… అంటూ సాగే పాటలో జంతు ప్రేమికుడైన పవన్‌ కళ్యాణ్‌ మనో వ్యధను ఆవిష్కరించారు. ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్స్‌ నిర్మాణ సారథ్యంలో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

గడ్డితింటావా.. తౌడు తింటావా… నా బుజ్జి గేదెమ్మా… నువు కుడితి తాగుతావా..! అంటూ ఎన్నికల్లో గెలిచి అపుడు చల్లగా పాలిస్తాను… నువ్వు మాత్రం ఇపుడు తెల్లగ పాలిస్తావు అంటూ వాస్తవ పరిస్థితులకు అద్ధంపట్టే విధంగా… మనుషులను నమ్మి మోసపోయానంటూ.. మనసులోని వ్యధను వెల్లబోసుకుంటున్నట్లు సాగుతోంది. ఓటేశారనుకుంటే వెన్నుపోటేశారని విచారంతో కోపావేశంతో ఊగిపోతున్నట్లు హావభావాలను చూపించారు. తనను దేవుడన్నాడొకడు ( బండ్ల గణేశ్‌), డైలాగిచ్చాడొకడు(త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌), నెత్తికెక్కిచ్చకున్నాడొకడు (చంద్రబాబునాయుడు) అందరూ కలిసి ముంచేశారని పాటనేపథ్యంలో వాళ్ల కేరక్టర్లను రివీల్‌ చేశారు. పాట సాగుతున్న నేపథ్యంలో ఫామ్‌ హౌస్‌ అంటే అత్యంత ఇష్టమున్న పవన్‌ కళ్యాణ్‌ వ్యవసాయ క్షేత్రంలో పవన్‌ కళ్యాణ్‌ స్వతహాగా సినిమాల్లో చూపించే మేనరిజం, సందర్భోచిత సంతృప్తి , ఆనందం, విచారం, ఫ్రస్టేషన్‌ ఫీలింగ్స్ తెరకెక్కించే ప్రయత్నంలో డైరెక్టర్‌ సఫలీకృతయ్యారు. పులిలాంటోడిని పిల్లిచేశారుగా.. అంటూ వెటకారపు పంచ్‌ వేశారు. నీకన్నా నాకు దోస్తులెవరమ్మా అంటూ గేదెతో మనో వ్యథను పంచుకున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. తన మనోభావనకు సంఘీభావం తెలపమని ప్రాధేయపడి గేదెతో అంబా అనే అరుపుతో సంకేతం వినిపించారు. గేదెకు కృతజ్ఞతలు తెలిపుతూ… చేతిలో చెరుకుగడ్డితో చిరాగ్గా పవన్‌ను చూపించారు. నీళ్లుకావాలా… అంటుగట్టాలా… నా బుజ్జి మొక్కమ్మా… నీకు కబుర్లు చెప్పాలా అంటూ… పచ్చని మొక్కల మధ్య చిరాకుతో చిర్రెత్తున్నట్లు వ్యవహరిస్తూ… అభిమానుతు విజిల్స్‌ తో పవర్‌ స్టారని ఉత్తేజపరచారని … పవరిమ్మని అడిగితే.. స్టార్స్‌ (చుక్కలు) చూపించారంటూ… జామచెట్లపై కామెడీ పండించే ప్రయత్నం చేశారు. నీకన్నా నాకు ఫ్రెండ్స్‌ లేరమ్మా… అంటూ నా బాధ నిజమైతే ఒక ఆకు రాల్చమ్మా అంటూ… కోరిన వెంటనే… ప్రశాంత వాతావరణంలో బలవంతంగా చెట్టే ఊగుతుంది తప్ప ఆకు రాలదు.. కానీ వ్యంగ్యంగా థాంక్యూ… థాంక్యూ అనడంతో పాట ముగుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ జులై 22 తేదిన సామాజిక మాధ్యమాల్లో గాకుండా… ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ డాట్‌ కామ్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ట్రైలర్‌ చూడాలనుకున్నవాళ్లు రూ.25లు చెల్లించి వీక్షించవచ్చని నిబంధన విధించారు.

Power Star Gaddi Tintava Song Review