Connect with us

Bhadradri Kothagudem

ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల పొంగులేటి సంతాపం…

Published

on

Ponguleti Srinivas Reddy Condoles To Pranab Mukherjee

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే తీవ్ర విచారం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలో చికిత్సపొందుతున్న ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం మృతి చెందారనే వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మాజీ భారత రాష్ట్రపతిగా, మాజీ కేంద్ర మంత్రిగా, పలు అత్యున్నతస్థాయి పదవుల్లో ప్రణబ్ ముఖర్జీ సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించా రని కొనియాడారు. సుదీర్ఘకాలం పాటు దేశ రాజకీయాల్లో కొనసాగిన ఆయన దేశం కోసం , దేశ ప్రజల కోసం ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన గొప్ప నేతగా అభివర్ణించారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే జాతీయ ఉపాధి హామీ లాంటి అనేక పథకాలకు రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ లేని లోటు దేశానికి , దేశ ప్రజలకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆ మహా నాయకుడు మృతిపట్ల ప్రగాఢ సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు.

Pranab Mukherjee health condition remains critical