Connect with us

Jayashankar Bhupalapally

రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ దందా…

Published

on

కరోనా వ్యాధి ఓ పక్క లాక్ డౌన్ మరో పక్కన ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యాన్ని గత మూడు నెలలుగా ప్రజలకు పంపిణీ చేస్తున్న క్రమంలో ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ దందాకు తెరలేపుతున్నారు. వివ‌రాల‌లోకి వెళితే…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:గణపురం మండల కేంద్రంలోని నిర్మానుష్యమైన ప్రాంతంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంని పక్క సమాచారంతో పోలీసులు పట్టుకొని సాంబయ్య అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన ఎస్.ఐ రాజన్ బాబు,వారి సిబ్బందితో పాటు,రెవెన్యూ అధికారులను పిలిచి పంచనామా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్న కొందరు కేటుగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిపై తగిన చర్యలు తీసుకొని ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఇక ముందు ఎవరైనా ఈ అక్రమ దందా చేస్తే వారిపై పీడీయాక్ట్ పెడతామని తెలిపారు,ఈ బియ్యం విలువ సుమారు రూ10 లక్షలు ఉంటుందని తెలిపారు.

Police seize PDS rice in Jayashankar Bhupalpally district

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *