Connect with us

Sangareddy

పుల్క‌ల్‌లో ఇంటింటికీ మొక్క‌ల పంపిణీ…

Published

on

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామంలో మంగళవారం నాడు గ్రామ సర్పంచ్ పడమటి అరుణ యాదగిరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఇంటికి ఐదు మొక్కలు చొప్పున పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మండల ఎంపిపి చైతన్య విజయభాస్కర్రెడ్డి ప్రత్యేకంగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలనిఆమె అన్నారు మొక్కలు నాటడమే కాకుండా వారి పర్యవేక్షణ కూడా చేయాలని ఆమె గ్రామ ప్రజలను కోరారు ఆరో విడత హరితహారం లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా6 మొక్కలు నాటాలి అన్నారు అంతేకాకుండా నాటడమే కాకుండా వారి పర్యవేక్షణ కూడా చేసి పర్యావరణాన్ని రక్షించాలని వారన్నారు ఎక్కడైనా వ్యాపారస్తులు చెట్లు నరికితే తమకు సమాచారం అందించాలని ఆమె అన్నారు చెట్లను నరికిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు కావున ఎక్కడ చెట్లను నరక వద్దని అన్ని గ్రామాలలో ప్రతి ఒక్కరు చెట్లను పెంచే ప్రయత్నం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గ్రామ ఎంపీటీసీ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

plants distribution in pulkal mandal

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *