వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం రైతన్నలకు వేదిక భవనాలపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన ఆయన రైతువేధికలు రైతులకెంతో ఉపయోగమని తెలిపారు. అదేవిధంగా కేసీఆర్ మాట ప్రకారమే నియంత్రిత సాగులో రైతులు ఉన్నారన్నారు. ఆదివారం హన్మకొండలోని వారి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన ఈ సందర్భంగా రైతువేధికలు శంఖుస్థాపన, రైతు కల్లాలు ఏర్పాటు, వ్యవసాయ సాగులో ప్రస్తుత పరిస్థితులు, రైతుల సమస్యలపై సమీక్షించారు.
Parkal MLA Challa Review Meeting On Farmers Issues