Connect with us

Mahabubabad

దిశ కమిటీ సమీక్షలో ఎంపీ క‌విత వీడియో కాన్ఫరెన్స్

Published

on

mp maloth kavitha attend disha committee with video conference

ములుగు జిల్లా దిశ కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు మహబూబాబాద్ ఎంపీ క‌విత‌. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ… అత్యవసర పరిస్థితుల్లోనూ కేంద్ర సహకారం శూన్యం కోవిడ్ పై పోరాటంలో రాష్ట్రానికి కేంద్ర నుంచి నిధులు లేవని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండి ఆదుకుంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కవిత సూచించారు. ప్రజాసంక్షేమమే.. మనందరి అంతిమలక్ష్యం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయగ్రామీణ ఉపాధిహామీపదకం నిధులు తప్పా.. కేంద్రప్రభుత్వం నుండి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ..నిధులు రావడం లేదన్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి_కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని కవిత అన్నారు. అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా మూలంగా ఒక్కమరణం కూడా సంభవించకుండా చూడాలన్నారు. వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీభూములు సాగుచేసుకుంటున్న రైతుల పట్ల అటవీ అధికారులు కఠినంగా వ్యవహరించరాదని.. అటవిభూముల సమస్యలన్నింటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ చూపాలని.. సీజనల్ వ్యాదులు వ్యాప్తిచెందే ప్రమాదం రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే కవితమ్మ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో పాటు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ములుగు నుండి వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

 

దిశ కమిటీ సమీక్షలో జిల్లా అధికారులతో ఎంపీ క‌విత వీడియో కాన్ఫరెన్స్

దిశ కమిటీ సమీక్షలో జిల్లా అధికారులతో ఎంపీ క‌విత వీడియో కాన్ఫరెన్స్

Posted by NH9 News Telangana on Thursday, August 27, 2020