Connect with us

Bhadradri Kothagudem

వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న ప్రాంతాల‌ను సంద‌ర్శించిన వ‌న‌మా…

Published

on

MLA Vanama Visitis Kothagudem Areas About Heavy Rain: గ‌త వారం రోజులుగా ఎడ‌తెర‌పి వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొత్త‌గూడెం ప‌రిస‌ర ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జీలు వ‌ర్ష‌ధాటికి పాడ‌వ్వ‌డం జ‌రిగింది. దీంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు త‌క్ష‌ణ‌మే స్పందించి రివ్యూ నిర్వ‌హించారు. ప‌లు ప్రాంతాల‌ను ఆయ‌న స్వ‌యంగా వెళ్లి ప‌రిశీలించారు. ఎక్క‌డెక్కడ‌ స‌మ‌స్య‌లు ఉన్నాయో సంబంధిత‌ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగానే రామవరం గోధుమ వాగు బ్రిడ్జిను సందర్శించి, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు. అదేవిధంగా బతుకమ్మ ఘాట్ కు మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు .

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ కాపు సీతాలక్ష్మి, స్థానిక కౌన్సిలర్ శ్రీమతి కూరపాటి విజయలక్ష్మి, మున్సిపల్ ప్రత్యేకాధికారి కృపాకర్ రావు, టిఆర్ఎస్ నాయకులు MA రజాక్, కాసుల వెంకట్, టీబీజీకేఎస్ నాయకుడు కాపు కృష్ణ, అన్వర్ పాషా, బూడిది గడ్డ యాకుబ్, కూరపాటి సుధాకర్, మోరే రమేష్, 22 వ వార్డు యాకుబ్, బాలాజీ నాయక్, కనకరాజు, జాన్సన్ సుధాకర్, పోకల నగేష్, త్రీ ఇంక్లైన్ సురేష్, శివ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.