Bhadradri Kothagudem
కొత్తగూడెం అభివృద్దిపై దృష్టి పెట్టిన వనమా…
Published
7 months agoon
MLA Vanama Meeting With National Highway Official
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నేషనల్ హైవే, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ వనమా మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ డివైడర్లు, స్వాగత ద్వారాలపై అధికారులతో చర్చించారు. నేషనల్ హైవే రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు రామవరం నుంచి పెద్దమ్మ గుడి వరకు సెంట్రల్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో నేషనల్ హైవే ఈఈ శ్రీ యుగంధర్, డీఈ నలిని, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రీ సంపత్ కుమార్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మరియు అధికారులు పాల్గొన్నారు.