Connect with us

Bhadradri Kothagudem

స్థానిక స‌మ‌స్య‌ల‌పై కేటీఆర్‌తో చ‌ర్చించిన రేగా…

Published

on

MLA Rega Kantharao Meets To KTR

పిన‌పాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంత్రి కేటీఆర్‌ని క‌లిశారు. పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గంలోని స్థానిక స‌మ‌స్య‌ల‌పై రివ్యూ చేసిన రేగా కాంతారావు స‌మ‌స్య‌ల‌ను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పిన‌పాక‌లోని బిటిపిఎస్ భూనిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాలు మ‌రియు అనేక పెండింగ్ సమస్య‌లను మంత్రి కి వివ‌రించారు. అదేవిదంగా జిల్లాలో తుపాన్ వల్ల దెబ్బతిన్న రహాదారులు, వంతెనలకు నిధులు సమకూర్చి తక్షణమే చర్యలు చేపట్టాలని మరియు పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ని కోరారు రేగా కాంతారావు.