Connect with us

Warangal Rural

పరకాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తా..చ‌ల్లా

Published

on

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తా అన్నారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి . నేడు ప‌ర‌కాల మున్సిపాలిటీలో ప‌ర్య‌టించిన ఎమ్మెల్యే చ‌ల్లా మున్సిపాలిటీ పరిధిలో రూ.70.50 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. రూ.20.00 లక్షలతో హరిజనవాడలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.35.00 లక్లల‌తో మాదారం మెయిన్ రోడ్డు నుండి బంధం రోడ్డు వరకు సిసి రోడ్డు నిర్మాణం పనులకు శంఖుస్థాపన. రూ.15.50 లక్షలతో తహసీల్దార్ కార్యాలయా ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయ‌డం జ‌రిగింది.

MLA Challa Visits Parakala Over Developing Works Inaugurates