Minister Satyavathi Rathod Participate Haritha Haram In Mulugu
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహార కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంది. జల్లా స్థాయి నుంచి పల్లె పల్లెకు ఈ కార్యక్రమం ఊపందుకుంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ,ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
