Connect with us

Jayashankar Bhupalapally

హ‌రీష్ చేతుల మీదుగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభం

Published

on

లాక్ డౌన్ లో అన్ని రంగాలు పూర్తిగా స్తంభించి పోయాయీ. కేవలం వ్యవసాయ రంగం మాత్రమే పురోగతి సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.అందోల్ మండలం సంగుపేటలో గల ప్రొఫెసర్ జయశంకర్ ప్రభుత్వ బాలికల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి చెందిందని ఆహార ఉత్పత్తి ధాన్యగార కేంద్రంగా తెలంగాణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని మంత్రి హరీష్ రావు అన్నారు.విద్యా విధానంలో ఎంతో వెనకబడ్డ తెలంగాణాను కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషిచేసారని అన్నారు.ఫారెస్ట్ కళాశాల హార్టీ కల్చర్ కళాశాల లాంటి ఫిష్యరిష్ లాంటివి తెలంగాణ లో ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థనే కాకుండా ఉద్యోగ పెంపొందించుకుంటున్నామని ఆయన అన్నారు.సింగూర్ జలాశయంలోకి కాళేశ్వరం నీరు త్వరలోనే రనున్నాయన్నారు.అందోల్ నారాయణఖేడ్ నియోజకవర్గల్లో కాళేశ్వరం నీరు తగు సాగుకు అందనున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బిబిపాటిల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ జెడ్పి చైర్ పర్సన్ మంజశ్రీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు..

Minister Harish Inaugurates Women Polytechnic College In Andol