Connect with us

Sangareddy

క‌డుపునొప్పి భ‌రించ‌లేక వివాహిత ఆత్మ‌హ‌త్య‌

Published

on

క‌డుపునొప్పి త‌ట్టుకోలేక వివాహిత ఆత్మ‌హ‌త్య‌. వివ‌రాల‌లోకి వెళితే… ముబారక్ పూర్ గ్రామం సదాశివపేట మండలానికి చెందినటువంటి శ్రీలత, ఆమె వయస్సు 28 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం మంతుర్ గ్రామం పుల్కల్ మండలానికి చెందినటువంటి మోటు దస్తయ్య తండ్రి నరసయ్య గారితో వివాహం జ‌రిగింది. వారికి ఇద్దరు కూతుర్లు దీక్షిత వయస్సు ఏడు సంవత్సరాలు, అక్షిత వయస్సు నాలుగు సంవత్సరాలు కాగా.. శ్రీలత గత నాలుగు సంవత్సరాల నుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంది చాలా ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ కడుపు నొప్పి తగ్గలేదు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి 8:30 గంటలకు శ్రీలతకు తీవ్రమైన కడుపు నొప్పి రాగా నొప్పి భరించలేక ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్ప‌టించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది.

marrieed women suicide unable to bear stomach pain