Connect with us

Jayashankar Bhupalapally

ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇటుకల తయారీ కేంద్రం

Published

on

-ప్రభుత్వ భూమిలో దర్జాగా ఇటుకల తయారీ కేంద్రం

-ప్రభుత్వ భూమిని అద్దెకిచ్చిన ఘనులు

-పంచాయతీ నల్ల ఇటుకల తయారీకి వాడుకం

-పట్టించుకోని,పంచాయతీ,రెవెన్యూ శాఖ అధికారులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కూరగాయల సంత సమీపంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని అద్దెకిచ్చి లబ్ధి పొందుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే కూరగాయల సొంత సమీపంలో గణపురం చెరువు కట్టను ఆనుకొని ఉన్న 6 గుంటల స్థలాన్ని చదును చేసి కొందరు వ్యక్తులు ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాను.ఇది ఇలా ఉండగా సంబంధిత స్థలాన్ని ప్రభుత్వం నుండి దారిద్ర్యరేఖకు దిగువకు ఉన్నట్లు నమ్మించి ఇట్టి స్థలాన్ని తీసుకున్నారు.అప్పటి తాసిల్దార్ కొందరు పేర్ల మీద 120 గజాల స్థలాన్ని ఇస్తున్నట్టు పట్టాలు అందజేశారు.దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తే కేవలం సంవత్సరం కాలంలో ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉంటుంగా కానీ వారు నిబంధనలకు విరుద్ధంగా 120 గజాల స్థలం కాకుండా ముగ్గురు పేర్లపై 6 గుంటల స్థలాన్ని చదును చేసి ఇటుకల తయారీ కేంద్రానికి అద్దెకు ఇచ్చారు.ఇటుకల తయారీ కూడా అంగడి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం బోరు నీటిని వినియోగిస్తున్నారు .ప్రభుత్వ భూమిలో ఇటుకల తయారీ కేంద్రం నడుపుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.భూమి ఆక్రమించు వారికి ప్రభుత్వం కేటాయించిన స్థలం ఎంత..? ప్రస్తుతం అక్రమంగా కబ్జా చేసిన స్థలం ఎంత..? రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణకు గ్రామ ప్రజలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

Jayashankar Bhupalpally District Updates