Connect with us

Warangal Rural

వణికిపోతున్న వ‌రంగ‌ల్ – హై అలెర్ట్

Published

on

High alert in Warangal over Maoist Celebrations

High alert in Warangal over Maoist Celebrations

 

తెలంగాణ‌లో మావోయిస్టులు వారోత్స‌వాల‌కు సిద్ధం అవుతున్నారు. పీపుల్స్ లిబరేషన్ అనే పేరుతో ఈ వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే నక్సలైట్లు పిలుపునిచ్చారు. దీంతో వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో నివసించే ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వారోత్స‌వాలు ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు మావోస్టులు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు, పోస్ట‌ర్ల‌తో హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు ప్ర‌తిఘ‌టించేందుకు రంగం సిద్ధం చేశారు. అడవులను జల్లెడ పడుతున్నాయి తనిఖీలు ముమ్మరం అయ్యాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఏజెన్సీ లో, సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఈ వారోత్స‌వాలు ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ పిలుపునిచ్చారు.

High alert in Warangal over Maoist Celebrations

 

Follow Us On Twitter, Instagram, Facebook