Connect with us

Entertainment

గుర్తుందా శీతాకాలం పూజా కార్య‌క్ర‌మాలు

Published

on

Gurthundha Seethakalam Movie Launched

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో స‌త్యదేవ్. యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీబ్యూటీ త‌మన్నా జంటగా న‌టిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో స‌త్యదేవ్, ద‌ర్శకనిర్మాత నాగ‌శేఖ‌ర్, సంగీత ద‌ర్శకుడు కాల‌భైర‌వ‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్డే, చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.ఈ చిత్రం ప్రతి ఒక్కరికి వారి ప్రేమకథను జ్ఞప్తికి తెచ్చే చిత్రం అవుతుంద‌ని ద‌ర్శ‌కుడు అంటున్నారు. ఓ యువకుడి ప్రేమజ్ఞాపకాలకు చక్కటి దృశ్కరూపంగా ఉంటుంది.