Connect with us

Telangana

స‌చివాల‌యం కింద గుప్త నిధులు…అందుకే కూల్చివేత‌?

Published

on

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ కూల్చ‌వేత స‌రైన‌ది కాద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. మ‌రో వైపు క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆ భ‌‌వ‌నాల‌ను కూల్చ‌డం కంటే ఆస్ప‌త్రులుగా మార్చితే బాగుండేద‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు. ఈ నేప‌థ్యంలో స‌చివాల‌య కూల్చివేత‌పై సీరియ‌స్ గా స్పందించారు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ ఫైర్ అయ్యారు. ఆ కూల్చివేత‌లో భాగంగా గుప్త నిధుల అన్వేషణ జరుగుతుందనే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు రేవంత్ రెడ్డి. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

gupta nidhulu under Telangana secretariat

 

Follow Us On Twitter, Instagram, Facebook