Entertainment
‘జోహార్’ లో గంగమ్మ కథ
Published
6 months agoon

Glimpse Of Gangamma Story From Johaar
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నుంచి మరో అద్భుతమైన చిత్రం రాబోతుంది. జోహార్ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు చూసిన సీన్లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఉద్దానం ఇష్యూని హైలెట్ చేసి ఓ గ్లిమ్స్ వదిలింది చిత్ర యూనిట్. జోహార్ చిత్రంలోని గంగమ్మ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్‌ను డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా విడుదల అయింది. ఈ గ్లిమ్స్ గమనిస్తే చిత్రంలో మంచి కంటెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉద్దానంలో కిడ్ని సమస్యపై గ్లిమ్స్ నడుస్తుంది. అమ్మా..నాకు దేవుడంటే చాలా ఇష్టం..ఎందుకంటే నాకు నిన్ను ఇచ్చాడు అని కూతురు తల్లితో అంటుంది. అప్పుడు ఉద్దానంలో కిడ్నీ సమస్యతో ఎంతో మంది మరణిస్తారు. చివరకు ఆ పాపకు కూడా కిడ్నీ సమస్య ఎదురవుతుంది. దీంతో తల్లి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎంతో ఉత్కంఠగా నడుస్తుంది. ఎన్నో అంచనాలు నమోదైన జోహార్ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ద్వారా ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది.
Glimpse Of Gangamma Story From Johaar