Connect with us

Karimnagar

కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డ్డ బాలుడికి ఈటెల సాయం…

Published

on

కుక్క‌ల దాడిలో గాయ‌ప‌డ్డ అక్షీత్ చికిత్స నిమిత్తం కుటుంబానికి 4 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయం చేశారు మంత్రి ఈటెల రాజేంద‌ర్. వివ‌రాల‌లోకి వెళితే…కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మమిడలపల్లి గ్రామానికి చెందిన ఐలవెని వెంకటేష్ కుమారుడు అక్షీత్ కొన్నిరోజుల క్రితం కుక్కల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అయితే గత శుక్రవారం చికిత్స నిమత్తం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండ‌గా… విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బాలుడి చికిత్స నిమత్తం 4 లక్షల రూపాయల చెక్కును వారి కుటంబసభ్యులకు అందజేశారు.

Etela Rajender Helps 4 Lakhs