Connect with us

Entertainment

ప్రభాస్‌తో దీపికా ప‌దుకునే రొమాన్స్…

Published

on

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధే శ్యామ్ చిత్రంలో న‌టిస్తున్నాడు పూజా హేగ్దే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధ‌కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం త‌రువాత ప్ర‌భాస్ మ‌రో పాన్ ఇండియా చిత్రంలో న‌టించ‌నున్నాడు. మ‌హాన‌టి సినిమాతో వెలుగులోకి వ‌చ్చిన నాగ్ అశ్విన్ ప్ర‌భాస్ తో సినిమా చేయ‌నున్నాడు. వైజ‌యింతి మూవీస్ ప‌తాకంపై ఈ చిత్రం నిర్మాణం కానుంది. మ‌రో బిగ్ అనౌన్స్ మెంట్ ఏంటంటే…ఈ చిత్రంలో బాలీవుడ్ పొడుగు కాళ్ల సుంద‌రి దీపికా ప‌డుకునే హీర‌యిన్గా చేయ‌నుంది. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తెలుగు నాట దీపికా మొదటి సినిమా ఇదే కావటంతో ట్విట్టర్ వేదికగా దీపికా పదుకునే స్పందించారు.అద్భుత‌మైన జ‌ర్నీని ప్రారంభించ‌డానికి నేను ఆగ‌లేకపోతున్నాను..అద్భుతమైన ప్రయాణం ముందుంది అంటూ ట్వీట్ చేశారు దీపికా పదుకొనె.. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ అనౌన్\్ మెంట్‌తో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు . ఇక ఇప్పటికే బాలీవుడ్ లోనూ ప్రభాస్ క్రేజ్ సంపాదించుకున్నాడు . ఇక ఈ సినిమా లో దీపికా కూడా ఉండడం తో సినిమా పై అక్కడ కూడా భారీ అంచనాలు ఏర్పడనున్నాయి.

Deepika Padukone and Prabhas in Nag Ashwin’s Next Movie