Andhra Pradesh
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్…
Published
7 months agoon
CM Jagan slows convoy making way for ambulance
అంబులెన్స్‌కు దారి ఇచ్చారు ఏపీ సీఎం జగన్. వివరాలలోకి వెళితే… పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్ కాన్వాయ్ దారి ఇచ్చి ఉధార స్వభావం చాటుకుంది. వైఎస్ వర్థంతిలో పాల్గొని తిరిగి పులివెందుల నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే దారిలో మార్గ మధ్యలో వేరే ప్రమాదం జరిగింది. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పై వెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని అబులెన్స్‌లో తరలిస్తుండగా అప్పుడు అదే దారిలో వెళ్తున్న సీఎం కాన్వాయ్ గమనించి దారి ఇచ్చింది.