Uncategorized
చిత్తూరు జిల్లా లో ఘోర ప్రమాదం…
Published
5 months agoon
చిత్తూరుజిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుపాళెం మండలం తగ్గువారిపల్లెకు చెందిన బాబు(45) పలమనేరు నుంచి చిత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బంగారుపాళెం పోలీసుస్టేషన్ పరిధిలోని పాలమాకులపల్లె సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా..అతని వెనుక వస్తున్న కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో బాబు(45) తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరెడ్డి (29)రత్నం (49)శ్రీనివాసులు (55) అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ఉన్న శిరీష (28)అనే మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు బెంగళూరుకి చెందిన వారిగా గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.